Kcr : కేసీఆర్ ఎంత చేసినా ఆగని ఫిరాయింపులు.. ఇక మీదట కష్టమేనా..?

Qubetvnews - July 6, 2024 / 08:22 PM IST

Kcr : కేసీఆర్ ఎంత చేసినా ఆగని ఫిరాయింపులు.. ఇక మీదట కష్టమేనా..?

Kcr : బీఆర్ ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఓవైపేమే కేసీఆర్ కుటుంబాన్ని కేసులు, విచారణ పేరుతో కమిషన్లు వెంటాడుతున్నాయి. ఇంకోవైపేమో బీఆర్ ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వరుసగా పార్టీ మారుతున్నారు. అందరూ హస్తం గూటికి వెళ్లిపోతున్నారు. మొదట్లో కేటీఆర్ రంగంలోకి దిగి ఫిరాయింపులు జరగకుండా చూడాలని చాలానే ప్రయత్నాలు చేశారు. కానీ కేటీఆర్ మాటను ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే గత పదేండ్ల నుంచి కేసీఆర్ కాకుండా ప్రతి విషయంలో కేటీఆర్ నే పార్టీ నేతలు సంప్రదిస్తున్నారు.

ఇక ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముంటుందిలే అని వారంతా అనుకున్నారు. ఎందుకంటే గతంలో కేటీఆర్ చాలా మంది నేతలకు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు కేటీఆర్ ఎంత పెద్ద హామీ ఇచ్చినా సరే పెద్దగా ఎవరూ నమ్మట్లేదు. దాంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. గత పదేండ్లలో ఆయన ఎన్నడూ జిల్లాల నేతలతో కూడా సమావేశం కాలేదు. కేవలం మంత్రులతో తప్ప ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడిన సందర్భాలు పెద్దగా లేవు. అలాంటిది ఇప్పుడు కేసీఆర్ స్వయంగా జిల్లాల నేతలను ఎమ్మెల్యేలను పిలిపించుకుంటున్నారు.

వారందరికీ స్పష్టమైన హామీలు ఇస్తున్నారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. ఈ సారి కంటిన్యూగా 15 ఏళ్లు అధికారంలో ఉంటామని చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు పార్టీ మారకుండా ఉంటే పెద్ద హామీలు ఇస్తున్నారు. నన్ను నమ్మండి అని చెబుతున్నారు. అంతే కాకుండా పార్టీ మారిన నేతలను మళ్లీ పార్టీలోకి తీసుకోబోమని కూడా చెప్పేస్తున్నారు. అయితే కేసీఆర్ ఇలా ఓవైపు బుజ్జగించి చెబుతూ.. ఇంకోవైపు వెళ్లిపోతే ఎలా ఉంటుందో కూడా హెచ్చరించే ప్రయత్నాలు చేస్తున్నా సరే ఎవరూ వినట్లేదు. ఓ వైపు కేసీఆర ఇంకా జిల్లాల నేతలతో మీటింగ్ పెడుతూనే ఉండగానే.. ఇంకోవైపు ఫిరాయింపులు కొనసాగుతున్నాయి.

మొన్న రాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కేసీఆర్ తో మీటింగ్ అయిపోయిన వెంటనే వెళ్లిపోయారు. ఇప్పుడు తాజాగా గద్వాల ఎమ్మెల్యే కూడా వెళ్లిపోయాడు. అంటే కేసీఆర్ మాటను కూడా ఎవరూ పెద్దగా వినట్లేదని తెలుస్తోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ ను వీడుతారని తెలుస్తోంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News