KTR : రేవంత్ ను టార్గెట్ చేస్తున్న కేటీఆర్.. కాంగ్రెస్ లో కల్లోలం..!

Qubetvnews - March 27, 2024 / 09:36 AM IST

KTR : రేవంత్ ను టార్గెట్ చేస్తున్న కేటీఆర్.. కాంగ్రెస్ లో కల్లోలం..!

KTR : వ్యూహానికి ప్రతివ్యూహం రచించడలో కేసీఆర్ ఫ్యామిలీ చాలా దిట్ట అని అందరికీ తెలిసిందే. అవతలి వ్యక్తి ఒక దెబ్బ కొడుతున్నాడంటే.. దాని నుంచి తప్పించుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం.. అవతలి వ్యక్తి కొట్టే దెబ్బ నుంచి తప్పించుకుంటూనే.. ఎదురు దెబ్బ కొట్టాలని చూస్తుంది. అదే కేసీఆర్ ఫ్యామిలీ విధానం. ఇప్పుడు కేటీఆర్ కూడా ఇదే పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత బీఆర్ ఎస్ ను, కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని ఆయన మొదటి నుంచి వాదిస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి అంటూ, మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇలా చాలా విషయాల్లో రేవంత్ ప్రచారం చేస్తున్నారు.

అంతే కాకుండా బీఆర్ ఎస్ హయాంలో జరిగిన ప్రతి స్కీమ్ లో అవకతవకలు ఉన్నాయంటూ వాటిని బయట పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అటు కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ ను ప్రజల్లో తగ్గిస్తూనే.. బీఆర్ ఎస్ నేతలను కూడా కాంగ్రెస్ లోకి లాగేసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది బీఆర్ ఎస్ నుంచి వెళ్లిపోతున్నారు. అయితే ఇలా రేవంత్ దూకుడుకు చెక్ పెట్టాలని కేటీఆర్ బలంగానే ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నారు. అందుకే ఆయన ఈ మధ్య రేవంత్ మీద ఓ బలమైన ఆరోపణ చేస్తున్నారు. అదేంటంటే.. రేవంత్ పార్టీ ఫిరాయిస్తారని.

ఎంపీ ఎన్నికలు అయిపోగానే రేవంత్ రెడ్డి వెళ్లి బీజేపీలో జాయిన్ అవుతారని పదే పదే ఆరోపిస్తున్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి కూడా ఓ షిండేలా మారిపోతారని అంటున్నారు కేటీఆర్. ఈ వ్యాఖ్యల వెనక బలమైన లోతు ఉందని అంటున్నారు. అదేంటంటే.. కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల కాంగ్రెస్ నేతల్లో కల్లోలం రేగుతోంది. రేవంత్ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే ప్రచారం ఉంది. అదే సమయంలో రేవంత్ హామీ ఇస్తేనే ఆ పార్టీలోకి చాలా మంది వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ మీద ఉన్న నమ్మకాన్ని దెబ్బ తీసే పనిలో పడ్డారు కేటీఆర్.

రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారాన్ని బలంగా తెరమీదకు తెస్తే.. అప్పుడు ఆయన మీద కాంగ్రెస్ లో నమ్మకం సడలుతుంది. అప్పుడు సేనలు చెదిరిపోయినట్టు నేతలు, కార్యకర్తలు చెదిరిపోతారు. అప్పుడు కాంగ్రెస్ లో అల్లకల్లోలం చెలరేగుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ లోకి వలసలు కూడా ఆగిపోతాయి.

అప్పుడు బీఆర్ ఎస్ ను వీడే వారి సంఖ్య కూడా తగ్గిపోతుందని కేటీఆర్ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు రేవంత్ మీద ఇలాంటి వ్యూహంతో ఆరోపణలు చేస్తున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు కేటీఆర్ వేస్తున్న వ్యూహం బాగానే ఫలిస్తుందని అంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News