Revanth reddy plan about bjp : ఎంపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొత్త వ్యూహం.. బీజేపీని సైడ్ చేసేలా..!

Qubetvnews - February 26, 2024 / 11:28 AM IST

Revanth reddy plan about bjp : ఎంపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొత్త వ్యూహం.. బీజేపీని సైడ్ చేసేలా..!

Revanth reddy plan about bjp : అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎవరూ ఊహించిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు తమకు వచ్చిన అధికారాన్ని రేవంత్ రెడ్డి చక్కగా వినియోగించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఆయన గ్రాఫ్ ను మరింతగా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డిపై ఢిల్లీ అధిష్టానం చాలా నమ్మకంతో ఉంది. అందుకే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించారు. అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రేవంత్ కూడా కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.

అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా గులాబీ పార్టీనే టార్గెట్ చేసింది. రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ సభ పెట్టినా సరే కేసీఆర్ ను, గులాబీ నేతలను టార్గెట్ చేస్తూ వెళ్లారు. అంతే తప్ప ఎక్కడా కూడా బీజేపీ పేరు ఎత్తలేదు. ఆయన వ్యూహం బాగానే ఫలించింది. అప్పటి వరకు కాంగ్రెస్ కు పోటీ ఇస్తున్న బీజేపీ సైడ్ అయిపోయింది. బీఆర్ ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొంది. చివరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ఎంపీ ఎన్నికల్లో జాతీయ పార్టీల హవానే ఎక్కువగా ఉంటుంది.

అందులో ఎలాంటి అనుమానం లేదు. బీఆర్ ఎస్ కు ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అందుకే ఈ సారి ఎంపీ ఎన్నికల్లో బాగా బీజేపీ గాలి వీస్తోంది. తెలంగాణలోనూ బీజేపీ ఎక్కువగా సీట్లు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం మోడీనే ఉండాలనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ హవా ఎక్కువగానే ఉండబోతోంది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించారు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీని సైడ్ చేసేందుకు కొత్త పంథాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అదే బీఆర్ ఎస్ ను హైలెట్ చేయడం.

ఎంత లేదన్నా బీఆర్ ఎస్ కూడా ఎంపీ ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయనేది నిపుణుల వాదన. కానీ ఎంపీ సీట్లు గెలిచేంత లేకపోవచ్చు. కాబట్టి దాన్ని రేవంత్ రెడ్డి వినియోగించుకోబోతున్నారు. బీజేపీని టార్గెట్ చేస్తూ కేంద్రం మీద, తెలంగాణ బీజేపీ ఎంపీల మీద విమర్శలు చేస్తే అదికాంగ్రెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది.

కాబట్టి బీజేపీని సైడ్ చేసేసి బీఆర్ ఎస్ ను మాత్రమే టార్గెట్ చేయబోతున్నారు. ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు, కాంగ్రెస్ మధ్యనే పోటీ అనేది రేవంత్ రెడ్డి నినాదం ఇస్తున్నారు. దాని వల్ల ప్రజల దృష్టి బీజేపీ వైపు మళ్లకుండా కేవలం కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్యనే ఉండేలా చూసుకుంటున్నారు. అది కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు తెచ్చేందుకు అవకాశాలు ఉంటాయనేది రేవంత్ ప్లాన్. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News