Revanth Reddy : రుణమాఫీ విషయంలో ఆ పని కూడా చేసి ఉంటే బాగుండేదేమో
Qubetvnews - July 18, 2024 / 04:58 PM IST
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుని.. లేదంటే ఒక పెద్ద పని చేసి మూడు నెలలు దాటిపోతోంది. ఓ వైపు ఏపీలో ఆయన గురువు చంద్రబాబు వరుసగా పథకాలను అమలుచేస్తూ దూసుకుపోతున్నారు. సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందకు దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదనే వాదన వినిపిస్తోంది. దాంతో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అతిపెద్ద సవాల్ ను స్వీకరించడానికి రెడీ అయిపోయింది. అదే రుణమాఫీ. రైతుల రూ.2లక్షల రుణాలను మాఫీ చేయడానికి ప్రబుత్వం సిద్ధమైంది.
ఈ రోజు సాయంత్రం రైతుల ఖాతాల్లోకి డబ్బుల బాకీ మాఫీ అయినట్టు మెసేజ్ లు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకులకు ఆదేశాలు కూడా వెళ్లాయి. అయితే రేవంత్ ప్రభుత్వం రుణమాఫీ కోసం 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 13 మధ్యలో తీసుకున్న పంట రుణాల్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. తుది గడువుగా ఉన్న డిసెంబరు 13 కటాఫ్ మీద ఎవరికి ఎలాంటి భేధాభిప్రాయం లేదు. కానీ 2018 డిసెంబరు 12 కటాఫ్ తేదీ మీదనే అందరికీ అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే డిసెంబర్ కంటే ముందు తీసుకున్న రుణాలు కూడా కొన్ని ఉన్నాయి.
అవి మరీ ఎక్కువగా లేవు. కాబట్టి వారిని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుండేదేమో. ఎందుకంటే అవి మహా అయితే ఇంకో రూ.500 కోట్లు లేదంటే రూ.1000 కోట్ల వరకు ఖర్చు అయ్యేవి. ఇప్పటికే ప్రకటించిన రుణమాఫీకి ఎలాగూ రూ.34వేల కోట్ల దాకా ఖర్చుచేస్తున్నారు. ఇంత మొత్తంలో పెట్టినప్పుడు ఇంకో వెయ్యి కోట్లు ఖర్చు పెడితే అయిపోయి ఉండేది. అప్పుడు అందరి దృష్టిలో రేవంత్ ప్రభుత్వం పట్ల సానుకూలత వ్యక్తం అయ్యేది. ఎందుకంటే వంద మందిలో తొంభై మంది మెచ్చుకుని.. పది మంది తిట్టుకున్నా బాగోదు కదా.. వందకు వంద మంది మెచ్చుకుంటేనే బాగుంటుందని చెబుతున్నారు.
కాబట్టి రేవంత్ ఆ విధంగా ఆలోచన చేసి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. ఎలాగూ ఆకలి తీర్చాలని అనుకన్నప్పుడు పరిమితులను పెట్టుకుని ప్లేట్ మీల్స్ పెట్టే బదులు.. కడుపు నిండా ఫుల్ మీల్స్ పెడితే బాగుండేదేమో అని చెబుతున్నారు.


