Chandrababu : కులాల చిచ్చు రేపుతున్న చంద్రబాబు.. ఇవేం హామీలు సామీ..!
Qubetvnews - April 12, 2024 / 08:58 AM IST
Chandrababu : చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎలాంటి హామీలు ఇవ్వడానికి అయినా సిద్ధపడుతున్నారంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఎందుకంటే అసలు సాధ్యమే కాని హామీలు ఇస్తున్నారు చంద్రబాబునాయుడు. అవి చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ ఏ మూలకు కూడా సరిపోదు. అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగనామం పెట్టడం చంద్రబాబుకు అలవాటే కాబట్టి ఇప్పుడు ఎవరికి పడితే వారికి.. ఏది పడితే అది హామీ కింద ఇచ్చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు తాజాగా బీసీలపై చంద్రబాబు కురిపిస్తున్న ప్రేమ చూస్తుంటే ఎవరికైనా షాకింగ్ గానే ఉంటుంది.
చంద్రబాబు తాజాగా మాట్లాడుతూ.. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తానని ప్రకటించడంతో అందరూ షాక్ అవుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు గతంలో 2014లో అధికారంలో ఉన్నప్పుడు రూ.1000 పింఛన్ ఇచ్చారు. అయితే జగన్ తాను అధికారంలోకి రాగానే రూ.2వేలు చేస్తామంటూ చెప్పడంతో చంద్రబాబు తన అధికారం అయిపోతున్న సమయంలో రూ.2వేలు చేశారు. అయినా సరే జనాలు చంద్రబాబును నమ్మకుండా జగన్ కు ఓటేశారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రజల వద్దకే వెళ్లి రూ.3వేలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఇదే పింఛన్లపై ఇష్టానురీతిగా హామీలు గుప్పిస్తున్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానని చెబుతున్నారు. ఇలా కులాల పేరుమీద పింఛన్లు ఇవ్వడం అంటే సమాజంలోని సమతుల్యతను దెబ్బతీయడమే అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఎవరికైనా సరే 60 ఏళ్లే నిండితేనే పింఛన్ వస్తోంది. కేవలం చేనేత కార్మికులకు, మత్స్య కార్మికులకు, చర్మ కార్మికులకు, డప్పులు కొట్టుకునే వారికి మాత్రమే 50 ఏళ్లకు పింఛన్ వస్తోంది. ఎందుకంటే ఈ వృత్తుల్లో ఎక్కువ కాలం ఆ ప్రజలు ఉపాధి పొందలేరు. దానితో దీర్ఘకాలం లబ్ది జరగదు కాబట్టే వారికి తక్కువ వయసుకే పింఛన్ ఇస్తున్నారు జగన్.
కానీ ఇప్పుడు బీసీలకు మాత్రమే 50 ఏళ్లకు పింఛన్ ఇస్తానని చంద్రబాబు చెప్పడం అంటే కులాల వారీగా సమాజాన్ని విడగొట్టడమే అని అంటున్నారు. ఇంత దారునంగా కులాల మధ్య చిచ్చు పెట్టడం.. ప్రజలను వర్గాలుగా విడగొట్టడం ఏంటని మండిపడుతున్నారు వైసీపీ నేతలు.
ఎందుకంటే బీసీలకు ఇస్తే.. ఇతర చిన్న కులల వారు ఊరుకుంటారా.. వారు కూడా తమకు తక్కువ వయసుకే పింఛన్ కావాలని రోడ్లమీదకు వస్తారు. దాంతో కులాల మధ్య చిచ్చు రేగుతుంది. చంద్రబాబు చేసిన పని వల్ల సమాజంలో కులల మధ్య గొడవలు జరుగుతాయని చెబుతున్నారు వైసీపీ నేతలు.





