Sperm Count : స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే ఏం తినాలి.. ఏం చేయాలి..?
Qubetvnews - February 29, 2024 / 07:42 PM IST
Sperm Count :
ఈ రోజుల్లో చాలామంది మగవారు ఈ సమస్యతో సతమతం అవుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేని ఇలాంటి బాధతో నలిగిపోతున్నారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే పిల్లలు పుట్టేందుకు అవకాశాలు ఉండవని అందరికీ తెలిసిందే. ఎందుకంటే వీర్యకణాల ఉత్పత్తి, స్పెర్మ్ కౌంట్, వీర్యకణాల వేగం, వీర్యకణాల ఆరోగ్యం లాంటి సమస్యలు ఉంటే మాత్రం అవి కచ్చితంగా సంతానం కలగకుండా చేస్తాయి. ఈ రోజుల్లో ఇలాంటి సమస్యలు ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. సరైన ఫుడ్ లేకపోవడం, వ్యాయామాలు చేయకపోవడంతో పాటు ఇతర అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి అసలు స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే, స్పెర్మ్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాయామం…
ఈ రోజుల్లో చాలా మంది కూర్చుని పని చేసే జాబులు వెతుక్కుంటున్నారు. అంతే కాకుండా ఎలాంటి వ్యాయామాలు చేయకుండా బాడీకి శ్రమ లేకుండా చూసుకుంటున్నారు. కాబట్టి కచ్చితంగా వ్యాయామాలు చేయాలి. వ్యాయామం చేయడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగాయి. వాటి వల్ల వీర్య కణాలు కూడా పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి.
జింక్…
స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు జింక్ కూడా ఎంతో దోహదం చేస్తుంది. ప్రతి రోజూ వ్యాయామాలు చేస్తే మాత్రం కచ్చితంగా జింక్ ను మీ ఆహారంలో ఉంచుకోవాలి. అప్పుడే స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. జింక్ ను ఎక్కువగా తీసుకోకున్నా.. ఆహారంలో ఒక భాగంగా తీసుకుంటే బెటర్.
విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించడం…
విశ్రాంతి తీసుకోవడం కూడా ఎంతో మంచిది. ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడితో బాధపడుతున్నారు. ఒత్తిడి వల్ల మనలో సెక్స్ కోరికలు బాగా తగ్గిపోతాయి. దాంతో సంతానోత్పత్తి దెబ్బతింటుంది. ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ హార్మోన్ లైంగిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అంతే కాకుండా వీలైనంత రెస్ట్ కూడా మంచిది.
తగినంత విటమిన్ డి…
విటమిన్ డి అనేది కూడా స్పెర్మ్ కౌంట్ ను పెంచేందుకు బాగా సాయం చేస్తుంది. ఇది టెస్టోస్టిరాన్ స్థాయిలను బాగా పెంచడంలో సాయం చేస్తుంది. ఈ విటమిన్ లోపం ఉన్న వారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి విటమిన్-డి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ డి కోసం ఉదయాన్నే ఎండలో కూర్చోవాలి.
తగినంత విటమిన్ సి…
విటమిన్-సి కూడా రోగనిరోధక శక్తిని పెంచేందుకు బాగా సాయం చేస్తుంది. కాకపోతే ఈ విషయం చాలా మందికి తెలియదు. విటమిన్-సి సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి మెరుగు పడేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాలు ఎన్నో సర్వేల్లో తేలాయి. కాబట్టి వీటిని పాటిస్తే మీకు కచ్చితంగా సంతానోత్పత్తి కలిగే అవకాశాలు ఉంటాయి.





