Health Tips : మిగిలిపోయిన అన్నాన్ని వేడి చేసి తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి..!

Qubetvnews - February 17, 2024 / 07:14 AM IST

Health Tips : మిగిలిపోయిన అన్నాన్ని వేడి చేసి తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి..!

Health Tips :

అన్నం అనేది మన రోజువారీ ఆహారంలో అత్యంత కీలకమైనది. ఇంకా చెప్పాలంటే మనం ప్రతిరోజూ తినే దాంట్లో అదే ముఖ్యం. అన్నం తినకపోతే మన కడుపు నిండినట్టు అనిపించదు. అంతే కాకుండా మన ఆహారం సంపూర్ణం అవ్వదు. అందుకే మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో మూడు పూటలా అన్నాన్ని తింటుంటారు. అయితే ఉదయం పూట పెట్టుకున్న అన్నం మిగిలిపోయినా.. లేదంటే రాత్రి వండుకున్న అన్నం మిగిలిపోయినా సరే తర్వాత రోజు ఉదయం మళ్లీ వేడి చేసుకుని తినడం చాలా అరుదు. అయితే ఇలా ఫ్రిజ్ లో పెట్టేసి తిరిగి దాన్ని వేడి చేసుకుని తినడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనది అని చెప్పేస్తున్నారు. ఎందుకంటే మిగిలిపోయిన అన్నాన్ని రెండో సారి వేచి చేస్తే అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అలాంటి అన్నాన్ని తింటే ఫుడ్ పాయిజనింగ్ అవ్వడమే కాకుండా ప్రమాదకరమైన జీర్ణాశయ వ్యాధులు కూడా వస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా మంది ఈ విషయంలో తెలియక ఇళ్లలో మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిజ్ లో పెట్టుకుని తర్వాత దాన్ని వేడి చేసుకుని తింటారు. ఎందుకంటే వండిన అన్నంలో తేమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది బ్యాక్టీరియా పెరిగేందుకు కారణం అవుతుంది.

అన్నాన్ని వండిన తర్వాత వెచ్చని ఉష్ణోగ్రతలలో, పాస్తా లాంటి పిండి పదార్థాలలో ఫుడ్ ఫాయిజన్ కు కారణం అయ్యే బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి అన్నం వండిన తర్వాత దాన్ని ఎక్కువ సేపు ఒకే రూమ్ లో ఉష్ణోగ్రతల వద్ద ఉంచితే అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి అన్నం తింటే చాలా రకాల సమస్యలు వస్తాయి. లూజ్ మోషన్స్, వాంతులు కావడమే కాకుండా నిర్జలీకరణం లాంటి సమస్యలు కూడా అనేకం వస్తుంటాయి. ఎందుకంటే తిరిగి వేడి చేసిన ఆహారంలో బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందుతుందంట.

సూక్ష్మక్రిములు 37 డిగ్రీల సెల్సియస్ వద్ద బాగా పెరుగుతాయి. దాని వల్ల అది తింటే బలహీనమైన ఇమ్యూనిటీ వ్యవస్థ ఉన్న వారికి, వృద్ధులకు, స్త్రీలు, గర్భిణులకు చాలా రకాల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. కాబట్టి మిగిలిపోయిన అన్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో తినొద్దని డాక్టర్లే స్వయంగా చెప్పేస్తున్నారు.

ఫ్రిజ్ లో ఉంచి అన్నం తినొచ్చా..?

చాలా మందికి తెలియని విషయం ఇది. ఫ్రిజ్ లో అన్నాన్ని పెట్టుకుని దాన్ని ఇష్టం వచ్చినప్పుడు తినేయాలని అనుకుంటారు. ఫ్రిజ్ లో ఉంచినప్పుడు అన్నం చల్లబడుతుంది కాబట్టి.. చాలా మంది దాన్ని తిరిగి వేడి చేసుకుంటారు. అలా వేడి చేసిన అన్నం చాలా ప్రమాదకరం అని డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News