KCR : కేసీఆర్ నల్గొండ సభకు చెక్ పెట్టేసిన రేవంత్.. ప్లాన్ అదిరిందిగా..!

Qubetvnews - February 17, 2024 / 07:26 AM IST

KCR : కేసీఆర్ నల్గొండ సభకు చెక్ పెట్టేసిన రేవంత్.. ప్లాన్ అదిరిందిగా..!

KCR :

కేసీఆర్ ఎంత ముందు చూపుతో ఆలోచిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ విషయంలో అయినా సరే కేసీఆర్ చాలా దూకుడుగానే ఉంటారు. అంతే కాకుండా సుదీర్ఘ ఆలోచన చేసిన తర్వాతనే ఒక ప్లాన్ ను అమలు చేస్తుంటారు. మరి అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా వ్యూహాలు రచించే కేసీఆర్.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. మరి ఖాళీగా ఉంటే ఇంకెన్ని వ్యూహాలు రిచస్తారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు తుంటి ఆపరేషన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యారు కేసీఆర్. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

దాంతో ఆయన మరో సారి తన పోరాట పటిమ ఏంటో చూపించాలని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు కృష్నా నది ప్రాజెక్టులను కేఆర్ ఎంబీకి అప్పగించడంపై పెద్ద ఎత్తున నల్గొండలో సభ పెట్టాలని భావించారు. నేడు మంగళవారం దాని కోసం భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ సభకు ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఈ విషయాన్ని గమనించిన రేవంత్ రెడ్డి ఊరుకుంటారా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టిన రేవంత్.. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని ఆయనకు అనుకూలంగానే ఉంటాయి.

అందుకే కేసీఆర్ సభకు ఆయన చెక్ పెట్టాలని భావించారు. అందుకే దానికి అసెంబ్లీని వేదికగా మార్చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు కేసీఆర్ సభ పెట్టి క్రెడిట్ కొట్టేసే కంటే తానే ముందు ప్రజలకు క్లారిటీ ఇచ్చేసి ఆ క్రెడిట్ కాస్తా కొట్టేయాలని ప్లాన్ వేసేశారు. ఇంకేముంది అసెంబ్లీ వేదికగా దాని మీద తీర్మానం ప్రవేశ పెట్టారు. కృష్నా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ ఎంబీకి అప్పగించేది లేదని తీర్మానాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టారు. దాంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడ్డట్టు అయిపోయింది. చచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి మద్దతు తెలపాల్సి వచ్చింది.

Revanth Reddy Planned Not Get Credit For KCR Nalgonda Sabha

Revanth Reddy Planned Not Get Credit For KCR Nalgonda Sabha

దాంతో సభ ఏకగ్రీవంగా తీర్మాణం చేసింది. దీంతో కేఈఆర్ ఎంబీకి కాంగ్రెస్ అప్పగిస్తున్నట్టు ఇన్ని రోజులు బీఆర్ఎస్ చేసిన ప్రచారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టినట్టు అయిపోయింది. కేసీఆర్ నల్గొండ సభకు క్రెడిట్ దక్కకుండా రేవంత్ వేసిన ఎత్తుగడ బాగానే సక్సెస్ అయిందని అంటున్నారు రాజకీయ నిపుణులు.

ఇక అక్కడితో ఆగట్లేదు రేవంత్ రెడ్డి. నేడు మేడిగడ్డ బ్యారేజీకి మంత్రులు, ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్తున్నారు. మేడిగడ్డను పరిశీలించి అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. దాని ద్వారా కాళేశ్వరం లోపాలను బయట పెట్టేసి బీఆర్ ఎస్ కు చెక్ పెట్టేందుకు మరో ఎత్తుగడ ప్లాన్ చేస్తున్నారు.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News