BRS : ఆ విషయంలో రేవంత్ ను టార్గెట్ చేయబోతున్న బీఆర్ ఎస్..!
Qubetvnews - March 12, 2024 / 09:39 AM IST
BRS : మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ ఎస్ చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎప్పుడు ఎలాంటి విమర్శలు చేయాలి, తమపై వచ్చే విమర్శలను ఎలా తిప్పి కొట్టాలనే ప్రతి విషయాన్ని కేసీఆర్ చాలా పకడ్బందీగా చూసుకుంటున్నారు. అంతే కాకుండా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విషయంలో టార్గెట్ చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచే బీఆర్ ఎస్ మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా పార్టీ గ్రాఫ్ పెంచుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్.
ఇందులో భాగంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ ఎస్ ను ఎన్ని రకాలుగా టార్గెట్ చేసి ఎండగడుతున్నారో అటు బీఆర్ ఎస్ కూడా రేవంత్ రెడ్డిని అన్ని రకాలుగా టార్గెట్ చేసి ఎండగట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు తెలంగాణలో పంటలు ఎండుతున్నాయని హైలెట్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో కేసీఆర్ హయాంలో వచ్చిన నీళ్లు ఇప్పుడు రావట్లేదు. అందుకు కారణాలు ఏమైనా సరే.. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లనే నీళ్లు రాక పంటలు ఎండుతున్నాయని బీఆర్ ఎస్ టార్గెట్ చేస్తోంది.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు, ఫొటోలను బీఆర్ ఎస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. చాలా చోట్ల పంటలు ఎండిన కాడికి కేటీఆర్ స్వయంగా వెళ్లి పరిశీలిస్తున్నారు. అంతే కాకుండా నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. కాగా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఇదే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయబోతోంది బీఆర్ ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి నీళ్లు ఇవ్వకపోవడం వల్ల పదేండ్ల కిందట ఉన్న కరువు మళ్లీ వస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు చేయడానికి రెడీ అవుతోంది బీఆర్ ఎస్ పార్టీ. ఇందులో భాగంగానే ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కూడా డిసైడ్ అయ్యారంట.
బీఆర్ ఎస్ కార్యకర్తలు ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ పంటలు ఎండిపోవడంపైనే చర్చ పెట్టాలని.. ఊర్లో దీనిపై అందరికీ వివరించాలని బీఆర్ ఎస్ ప్లాన్ వేస్తోంది. రైతుల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చేలా చేయాలనుకోవడమే ఇప్పుడు బీఆర్ ఎస్ ముందు ఉన్న అతిపెద్ద పని అని తెలుస్తోంది.
కాబట్టి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ ఎస్ పార్టీ ఈ విషయంలో లబ్ది పొందే అవకాశాలు ఉన్నాయంటున్నారు బీఆర్ ఎస్ కార్యకర్తలు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇలాంటి పని చేయబోతున్నారంట. చూడాలి మరి ఈ విషయంలో బీఆర్ ఎస్ కు ఏ విధంగా కలిసి వస్తుందనేది.



