Chandrababu-Revanth : తెగని పంచాయితీ.. చంద్రబాబు, రేవంత్ మీటింగ్ ఫెయిల్..?

Qubetvnews - July 7, 2024 / 04:04 PM IST

Chandrababu-Revanth : తెగని పంచాయితీ.. చంద్రబాబు, రేవంత్ మీటింగ్ ఫెయిల్..?

Chandrababu-Revanth : రెండు తెలుగు రాష్ట్రాల నడుమ తెగని పంచాయితీలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా విభజన చట్టంలోని సమస్యలు అన్నీ అలాగే ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని గతంలో కేసీఆర్, చంద్రబాబు భేటీ అయ్యారు. కానీ సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కేసీఆర్, జగన్ కూడా భేటీ అయ్యారు. వీరిద్దరూ ఒకరికి ఒకరు రాజకీయంగా ఎంతో సన్నిహిత్యంగా ఉన్నారు కాబట్టి.. ఎంతో కొంత సమస్యలు పరిష్కారం అవుతాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వారిద్దరి మధ్య కూడా విభజన సమస్యలు కొలిక్కి రాలేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా వీరిద్దరికీ మంచి సన్నిహిత్యం ఉండచ్చు.

కానీ రాజకీయంగా మాత్రం ఎవరి ఒత్తిడిలు వారికి ఉన్నాయి. తెలంగాణ నుంచి ఒక్క రూపాయి ఆంధ్రాకు ఇచ్చినా తెలంగాణ ప్రజల దృష్టిలో కేసీఆర్ మీద వ్యతిరేకత వస్తుంది. అలాగే ఆంధ్రా నుంచి ఒక్క రూపాయి తెలంగాణకు ఇచ్చినా ఆంధ్రా ప్రజల దృష్టిలో జగన్ మీద వ్యతిరేకత ఖాయం. అందుకే అప్పుడు అవి తెగలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ లు సీఎంలుగా ఉన్నారు కాబట్టి ఏమైనా సమస్యలు తెగుతాయేమో అని అంతా అనుకున్నారు. ఎందుకంటే వీరిద్దరూ గురు, శిష్యులుగా ఎంతో సన్నిహిత్యం ఉన్నవారు. పైగా చంద్రబాబు మాటను రేవంత్ కాదనలేడేమో అని అంతా అనుకున్నారు.

కాబట్టి కొన్ని సమస్యలకు అయినా పరిష్కారం దొరుకుతుందని అనుకున్నారు. కానీ ఏ ఒక్క సమస్యలకు కూడా పరిష్కారం దక్కలేదు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిసిన ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని రేవంత్ కోరారు. కానీ అది తన చేతిలో లేదని చంద్రబాబు చెప్పారు. కేంద్రం చేతిలోనే ఉందని చెప్పి తన మీద భారం లేకుండా చూసుకున్నారు. ఇక తెలంగాణలో ఉన్న ఉమ్మడి బిల్డింగులను కొన్నింటిని తమకు అప్పజెప్పాలని చంద్రబాబు ప్రభుత్వం కోరింది. కానీ దానికి రేవంత్ ప్రభుత్వం తిరస్కరించింది. హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విషయంలో కూడా రేవంత్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు.

అంటే మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు అడిగిన వాటికి రేవంత్ రెడ్డి.. రేవంత్ అడిగిన వాటికి చంద్రబాబు ఒప్పుకోలేదు. కాబట్టి ఈ పంచాయితీ ఇంకా తెగట్లేదు. ఇప్పట్లో చూస్తే ఈ పంచాయితీ తెగే విధంగా కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇవి చాలా సున్నితమైన అంశాలు.

ఏ ఒక్కటి అటు పోయినా.. ఏ ఒక్కటి ఇటు రాకపోయినా సరే ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాలు వ్యక్తం అవుతాయి. కాబట్టి వాటికి చంద్రబాబు, రేవంత్ గురి కావాల్సి వస్తుంది. అందుకే ఈ సమస్యలు చాలా జఠిలమైనవిగా చెబుతున్నారు. వీరి హయాంలోనే అవి పరిష్కారం కాలేదంటే.. ఇక భవిష్యత్ లో కూడా కావేమో అంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News