Health Tips : ప్రెగ్నెన్సీ టైమ్ లో మటన్ తినొచ్చా.. తింటే వచ్చే సమస్యలేంటి..?
Qubetvnews - February 21, 2024 / 03:58 PM IST

Health Tips :
చాలా మందికి తెలియని కొన్ని ఆరోగ్య విషయాలు కూడా ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా మామూలు వారి కంటే ప్రెగ్నెంట్ తో ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఎక్కువగా ఉంటాయి. వారికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో.. ఎలాంటి ఆహారం తీసుకోవద్దో అనే విషయాలు తెలియదు. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కచ్చితంగా ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవాలి. అప్పుడే కడుపులో బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే రెడ్ మీట్ ను ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందంట.
చాలా మంది ప్రెగ్నెన్సీ సమయంలో చికెన్ కంటే ఎక్కువగా మటన్ మాత్రమే తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే చికెన్ చాలా త్వరగా జీర్ణం అవుతుంది. దాని వల్ల ఐరన్ లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ప్రోటీన్లు కూడా బాడీకి బాగానే అందుతాయి. తల్లి, బిడ్డకు ఇద్దరికీ అవసరమైన విటమిన్ బి 12, విటమిన్ ఎ, జింక్ వంటి పోషకాలు కూడా అందుతాయి. అయితే ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో చాలా మందికి తెలియక ఎక్కువగా చికెన్ కంటే మటన్ తింటుంటారు. అయితే మటన్ లేదా రెడ్ మీట్ తినొద్దని ఆరోగ్య నిపుణులు కూడా సలహాలు ఇస్తున్నారు.
మటన్ తింటే వచ్చే సమస్యలు..
అయితే మటన్ వల్ల ఎన్నో ప్రోటీన్లు అందుతాయన్న విషయం మనకు తెలిసిందే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలా మందికి తెలియని మరో విషయం కూడా ఇందులో ఉందండోయ్. అదేంటంటే మటన్ ను ఎక్కువగా తీసుకుంటే మాత్రం కచ్చితంగా కొన్ని సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. తల్లితో పాటు బిడ్డకు కూడా ఇది అనారోగ్యకరమే. ఎక్కువగా రెడ్ మీట్ తీసుకుంటే బ్లడ్ లో షుగర్ లెవల్స్ బాగా పెరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే మటన్ తీసుకుంటే షుగర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
ఎందుకంటే చికెన్ జీర్ణం అయినంత సులువుగా మటన్ జీర్ణం కాదు. దాని కోసం బాడీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీతో ఉనన వారు ఎలాంటి పనులు పెద్దగా చేయలేరు. అంతే కాకుండా ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో ఆడవారి జీర్ణ వ్యవస్థ చాలా నెమ్మదిగా పని చేస్తుంది.
కాబట్టి ఇలాంటి సమయంలో మటన్ ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. కడుపునొప్పి, మలబద్దకం లాంటివి వస్తాయి. పైగా మటన్ ను సరిగ్గా శుభ్రం చేయకపోయినా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సరిగ్గా కడగకపోతే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా పెరుగుదల గర్భిణీ స్త్రీ శరీరంలో విషాన్ని వ్యాప్తి చేస్తుంది. అలాగే ఇది అబార్షన్ కు దారితీస్తుంది. కాబట్టి మటన్ ను ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తినాలిన అనిపించినా సరే తాజా మాంసాన్ని వండుకుని బాగా ఉడికించుకుని తినాలి. అది కూడా నెలలో రెండు సార్లు తింటే బెటర్.