Health Tips : ఉదయం పూట తినడం మానేస్తున్నారా.. ఎన్ని సమస్యలో తెలుసా..?
Qubetvnews - February 27, 2024 / 07:42 PM IST

Health Tips :
ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవచ్చు గానీ.. ఆరోగ్యం పోతే మాత్రం సంపాదించుకోవడం చాలా కష్టం. అందుకే ఈ రోజుల్లో డబ్బులు సంపాదించుకోవడం కంటే కూడా ఆరోగ్యంగా ఉండటమే చాలా అవసరం. అయితే ఈ రోజుల్లో ఫైనాన్షియల్ టెన్షన్లు, పని ఒత్తిడిలో ఉండి చాలా మంది తిండి సరిగ్గా తినరు. ఇంకొంత మంది అయితే ఉదయం పూట తినకుండానే పనికి వెళ్లిపోతుంటారు. చాలా రకాల కారణాలతో వారు ఇలా ఉదయం పూట తిండిని అవాయిడ్ చేస్తుంటారు. అయితే ఇలా ఉదయం పూట తిండి మానేస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
మన బాడీలో మెబాలిజం స్టార్ట్ అవడంలో బ్రేక్ ఫాస్ట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కానీ చాలా మందికి ఈ విషయం మాత్రం తెలియక ఉదయం పూట తిండి మానేసి ఆగమేఘాల మీద పనికి వెళ్లి పోతుంటారు. ఇంకొంత మంది లేటుగా నిద్ర లేవడం వల్ల ఉదయం పూట తినకుండా ఉండిపోతుంటారు. అయితే ఇలా ఉదయం పూట తినకపోవడం వల్ల సడెన్ గా బరువు పెరిగిపోవడంతో పాటు పోషకాల లోపాలు అలాగే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇది మన బాడీతో పాటు మెదడు మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంకా ఏయే రకాల సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.
ఏకాగ్రత…
మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మన మెడదు అంత చురుగ్గా పని చేస్తుంది. ఎందుకంటే మనం బ్రేక్ ఫాస్ట్ లో తినే తిండి మన మెదడుకు గ్లూకోజ్ అందిస్తుంది. మీరు బ్రేక్ ఫాస్ట్ మానేస్తే మాత్రం మీ ఏకాగ్రత బాగా దెబ్బతింటుంది. అంతే కాకుండా అభిజ్ఞా తీరు కూడా మారుతుంది. కాబట్టి మీరు పనిచేసే శక్తిని కూడా కోల్పోతారు.
పోషకాహార లోపం…
ఉదయం పూట తినే ఆహారం వల్ల మన బాడీకి పోషకాహారం అందుతుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు, ఖనిజాలు ఉన్న బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవాలి. లేకపోతే మీరు పోషకాల ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
మూడ్ స్వింగ్స్…
ఉదయం పూట తినకపోవడం అనేది మన ఆలోచనల మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఉదయం పూట తినకపోతే బ్లడ్ లో షుగర్ లెవల్స్ బాగా పెరుగుతాయి. దాంతో మీ మూడ్, స్వింగ్స్, చిరాకు లాంటివి పెరిగిపోయి మీరు అసహనంగా కనిపిస్తారు. అంతే కాకుండా మీ బ్లడ్ లో షుగర్ లెవల్స్ బాగా పెరుగుతాయి.
బరువు పెరగడం…
మనం రెగ్యులర్ గా ఉదయం పూట తినకపోవడం వల్ల ఆకస్మికంగా బరువు పెరిగిపోతామని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది తినకపోతే బరువు తగ్గుతామని అనుకుంటారు. కానీ తినకపోవడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఉదయం పూట తినకపోవడం వల్ల మధ్యాహ్నం మితిమీరి తింటారు. దాని వల్ల మీరు ఆకస్మికంగా బరువు పెరిగిపోతారు.