Anger Management : కోపం ఎక్కువగా వస్తుందా.. అయితే ఈ ఫుడ్స్ అస్సలు తినొద్దు..!
Qubetvnews - February 17, 2024 / 06:56 AM IST
Anger Management :
తన కోపమే తన శత్రువు అనే మాటను పెద్దలు ఊరికే చెప్పలేదు. ఎందుకంటే కోపం అనేది మన వాళ్లను మనకు దూరం చేస్తుంది. అంతే కాకుండా కొన్ని పరిస్థితుల్లో మనం చూపించే కోపమే మనల్ని సర్వనాశనం చేస్తుంది. చివరకు ఒంటరిని చేసి ప్రపంచం నుంచి వెలేసేలా చేస్తుంది. అందుకే ఎంత సహనంతో ఉంటే అంత బెటర్ అని ఆరోగ్య నిపుణులతో పాటు మానసిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. కొందరికి చిన్న చిన్న విషయాలకు కూడా కోపం వస్తుంది. అలాంటి వారు తమ జీవితాన్ని సరైన దారిలో నడిపించలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.
అయితే మన కోపాన్ని మనం తీసుకునే ఆహారాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. కొన్ని కొన్ని ఆహారాలు తీసుకుంటే కోపం మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి అలాంటి ఆహారాలను అస్సలు తీసుకోవద్దని డాక్టర్లు సైతం చెబుతున్నారు. ఇంతకీ ఏయే ఆహారాలను తీసుకోవద్దు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ రిచ్ ఫుడ్స్…
షుగర్ రిచ్ ఫుడ్స్ అనేవి మన కోపాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే క్యాండీలు, చాక్లెట్లు, స్వీట్లతో పాటు ఇతర తీపి పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ఇవి తిన్నప్పుడు మన రక్తంలోని చెక్కర స్థాయిలను బాగా పెంచేస్తాయి. దాంతో మన మూడ్ మారిపోతుంది. చిరాకు, అసహనం లాంటివి కనిపిస్తాయి.
కెఫిన్…
కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకున్నా సరే కోపం అనేది ఎక్కువ అవుతుందని డాక్టర్లే చెబుతున్నారు. ఎందుకంటే వీటిని తీసుకున్నప్పుడు మనలో ఒత్తిడి, ఆందోళన, చిరాకు లాంటివి ప ఎరుగుతాయి. మానసికంగా స్థిరంగా ఉండలేకపోతారు. కాబట్టి కెఫిన్ ఆహారానికి దూరంగా ఉంటేనే బెటర్.
ప్రాసెస్ చేసిన ఆహారాలు…
ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టమే. కానీ వాటి వల్ల మన మానిసిక స్తితి కూడా మారుతుందని చాలా మందికి తెలియదు. ఈ ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో కొవ్వులు, సంకలనాలు ఉంటాయి. ఇవి మీ న్యూరోట్రాన్స్మిటర్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. దాంతో మీ మానసిక స్థితి గందరగోళంగా మారుతుంది. ఆటోమేటిక్ గా మనకు చిరాకు, కోపాలు ఎక్కువ అవుతుంటాయి. అందుకే ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటే బెటర్.
స్పైసీ ఫుడ్స్…
కారం అనేది కోపానికి ప్రధాన కారణమే. కానీ చాలా మంది స్పైసీగా ఉండే ఫుడ్స్ ను తింటుంటారు. దాని వల్ల కూడా ఒత్తిడి, ప్రెషర్ బాగానే పెరుగుతాయి. అందుకే కోపం ఈజీగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఆల్కహాల్…
ఈ రోజుల్లో ఆల్కాహాల్ ను విచ్చలవిడిగా తాగేస్తున్నారు. మందును ఎక్కువగా తాగే వారిలో కోపం, మానసిక సమస్యలు చాలానే ఎక్కువగా ఉంటాయి. చాలా త్వరగా మూడ్ మారిపోతుంది. ఇంకా చెప్పాలంటే ప్రశాంతంగా ఉన్న వారిని కూడా కోపం వచ్చేలా చేస్తుంది. అందుకే ఆల్కాహాల్ కు వీలైనంత వరకు దూరంగా ఉండాలి.
ఉప్పు
ఉప్పు అనేది మితంగా తింటేనే మంచిది. కాస్త ఎక్కువ అయినా సరే అది మన బాడీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మరీ ముఖ్యంగా మన మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. స్నాక్స్, మొదలైన వాటిని ఎక్కువగా తింటే కచ్చితంగా మానసిక పరిస్థితి కంట్రోల్ తప్పుతుంది. కాబట్టి ఉప్పును తక్కువగా తీసుకుంటే చాలా బెటర్.





