Revanth Reddy : రేవంత్ రెడ్డి మరో మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ షాక్ ఇవ్వబోతున్నారా..?
Qubetvnews - February 17, 2024 / 11:12 AM IST
Revanth Reddy :
బీఆర్ ఎస్ మళ్లీ ప్రజల్లో పట్టు పెంచుకోకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి మరో మాస్టర్ ప్లాన్ వేయబోతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ ఎస్ ఎలాగైనా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ సాధించడమే టార్గెట్ గా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు అతిపెద్ద అచీవ్ మెంట్ అయిన ఎత్తిపోతల పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను బలంగా ప్రచారం చేసుకోవాలని చూస్తోంది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా అలెర్ట్ అయ్యారు. ఎలాగైనా బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని భావించినట్టు తెలుస్తోంది.
అందుకే అసలు సాగునీటి ప్రాజెక్టుల్లో ఉన్న అవతతవకలను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా దీనిపైనే చర్చిస్తామని తాజాగా ప్రకటించారు. అంతే కాకుండా అసలు తెలంగాణ వచ్చిందే నీళ్ల విషయంలో కాబట్టి.. అసలు ఆంధ్రా వాళ్లు నీళ్లు ఎలా తీసుకెళ్లారో.. కేసీఆర్ హయాంలో ఎంత వరకు ఆంధ్రాకు అక్రమంగా నీళ్లు పంపిచారు అనేది.. దాంతో పాటు ఏపీ సీఎం జగన్ ఎన్ని ప్రాజెక్టులు కట్టారనేదాన్ని కూడా ఆయన మీడియా ముఖంగా వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో గోదావరి మీద కట్టిన ప్రాజెక్టులు అన్నీ కేంద్రానికి స్వాధీనం చేయాలని కేసీఆర్ సమక్షంలోనే రాసినట్టు గుర్తు చేశారు.
అంతే కాకంఉడా కృష్ణానదిలోని 811 టీఎంసీల నీటిటో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇస్తే ఊడా కేసీఆర్ అంగీకరించి తెలంగాణకు తక్కువ వాటా వచ్చేలా చేశారని విమర్శలు గుప్పించారు. దాంతో పాటు కృష్ణా జలాల్లో అప్పుడు 50 శాతం వాటా కావాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు, జగన్ సీఎంలుగా ఉన్నప్పుడు జలదోపిడీకి జరిగినా సరే కేసీఆర్ మౌనంగా ఉండి సహకరించారంటూ ఆధారాలతో సహా నిరూపించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌ను ఏపీ ఆక్రమిస్తే కేసీఆర్ స్పందించలేదని.. సాగునీటి ప్రాజెక్ట్‌లపై రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిద్దామన్నారు.
సాగునీటి ప్రాజెక్ట్‌లపై శ్వేతపత్రం విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇలా సాగునీటి విషయంలో బీఆర్ఎస్ కు ఉన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది గనక సక్సెస్ అయితే ఇన్ని రోజులు తెలంగాణ కాళేవ్వరం, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంటూ బీఆర్ఎస్ చేస్తున్న హంగామా మీద నెగెటివిటీ రాక మానదు.
కాబట్టి రేవంత్ రెడ్డి ముందు చూపుతో వేస్తున్న ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వేస్తున్న ప్లాన్ వల్ల కాంగ్రెస్ కు మరింత పాజిటివిటీ పెరిగేలా ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అది అంతిమంగా ఎంపీ ఎన్నికల్లో కలిసొచ్చే విధంగా ఉందని చెబుతున్నారు.



