Revanth Reddy : ఆ విషయంలో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి.. ప్లాన్ వర్కౌట్ అయిందే..!
Qubetvnews - February 18, 2024 / 06:21 AM IST
Revanth Reddy :
రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టేసి కాంగ్రెస్ మీద ప్రజల్లో సానుకూలత పెరిగే విధంగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రధానంగా వేసిన ఎత్తుగడ బీఆర్ ఎస్ ఇమేజ్ ను దెబ్బ తీయడం. బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో చాలా గొప్పగా చెప్పుకుంటున్నది కాళేశ్వరం ప్రాజెక్టు. మొదటి నుంచి బీఆర్ఎస్ దాన్ని ఘనంగా చెప్పుకుంటోంది. తమ చరిత్ర అని ప్రచారం చేస్తోంది. అయితే దాన్ని దెబ్బ తీయాలని రేవంత్ సర్కార్ ప్లాన్ వేసింది.
బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆ పార్టీకి ప్రజల్లో ఇంకా కొంత బలం ఉంది. కాబట్టి దాన్ని ముందు దెబ్బ తీస్తే కచ్చితంగా కాంగ్రెస్ మీదకు ప్రజల దృష్టి మరలుతుందని రేవంత్ ప్లాన్ వేసారు. ఇందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అసెంబ్లీ సాక్షిగా మేడిగడ్డ మీదనే చర్చలు జరిపారు. అంతే కాకుండా ఎమ్మెల్యేలు, మంత్రులను మేడిగడ్డకు తీసుకెళ్లి మరీ పిల్లర్లు కుంగిన దాన్ని మీడియాకు చూపించారు. దాంతో ఆ విషయం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. జాతీయ డ్యామ్ అథారిటీ అధికారులు చెప్పిన విషయాలను కూడా మీడియాలో హైలెట్ అయ్యేలా చూశారు.

Revanth Reddy Publicizes Defects Of Medigadda Barrage
మేడిగడ్డలో నాణ్యత లోపాలు అధికంగా ఉన్నాయని.. రిపేర్ చేయలేమని అధికారులు చెప్పిన విషయాలను ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చూసుకున్నారు రేవంత్ రెడ్డి. దాంతో కాళేశ్వరం మొత్తం ఓ విఫల ప్రయత్నంగా ప్రజల్లో చర్చ జరుగుతోంది. అయితే రేవంత్ అక్కడితో ఆగలేదు. ఏకంగా అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం మీద ప్రజెంటేషన్ కూడా ఇప్పించారు. మేడిగడ్డ ఎలా కుంగిందో.. ఎలాంటి డ్యామేజ్ జరిగిందో కూడా చూపించారు. దాంతో పత్రికలు, మీడియా ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లలో ఇదే పెద్ద చర్చ అయిపోయింది. ఇన్ని రోజులు కాళేశ్వరం అంటే ఓ గొప్ప ప్రాజెక్టుగా ప్రజల్లో ఉండేది.
కానీ దాన్ని కూలిపోయే కట్టడంగా ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్ సర్కార్ సక్సెస్ అయింది. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇన్ని రోజులు కాళేశ్వరాన్ని చూపించి ఓట్లు అడిగారని.. ఇప్పుడు ఏం చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు.
ఈ ఎఫెక్ట్ రాబోయే ఎంపీ ఎన్నికల్లో పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు రాజకీయ నిపుణులు. రేవంత్ సర్కార్ వేసిన ఎత్తుగడ వల్ల ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రజలు ఆశలతో చూస్తున్నారు. ఈ అవకాశాన్ని రేవంత్ అన్ని విధాలుగా వినియోగించుకుంటే మాత్రం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు భారీగా సీట్లు రావడం ఖాయం అంటున్నారు రాజకీయ నిపుణులు.



