TDP : కూటమిలో బీజేపీ ఉన్నట్లా? లేనట్లా?

Qubetvnews - May 1, 2024 / 08:13 AM IST

TDP : కూటమిలో బీజేపీ ఉన్నట్లా? లేనట్లా?

TDP :

ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గర పడుతుంది. రెండు వారాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టబోతున్నాం అనేది తేల్చబోతున్నారు. పవన్ కళ్యాణ్ కష్టపడి తెలుగుదేశం పార్టీ, బిజెపి కలిసి నడిచే విధంగా పావులు కదిపాడు. కానీ బిజెపి మాత్రం అయిష్టంగానే ఈ కూటమికి ఒప్పుకున్నట్లుగా తాజా పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది. గతంలో ఈ మూడు పార్టీలు కూటమి కట్టి ఎన్నికలకు వెళ్ళిన సమయంలో నరేంద్ర మోడీ పలు దఫాలుగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఈసారి మాత్రం ఒకే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కి వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు.

అంతే కాకుండా తాజాగా విడుదలైన ఉమ్మడి మేనిఫెస్టో పుస్తకంపై తన ఫోటోను ముద్రించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించలేదట, అలాగే బిజెపి ప్రధాన న్యాయకత్వానికి సంబంధించిన ఫోటోను కూడా ముద్రించేందుకు ఒప్పుకోలేదు. అంటే మేనిఫెస్టోలోని అంశాలతో బిజెపికి సంబంధం లేదు అంటూ ఆ పార్టీ నేతలు చెప్పకనే చెబుతున్నారు. ఇక జనసేనకు సంబంధించిన గ్లాస్ గుర్తును ఆ పార్టీ పోటీ చేయని చోట ఇండిపెండెట్స్‌ కు ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ముఖ్య నాయకత్వం స్పందించి ఈసీ తో మాట్లాడి ఉంటే కచ్చితంగా జనసేన కి మాత్రమే గాజు గ్లాస్ గుర్తు వచ్చేది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎలక్షన్ కమిషన్ ని కచ్చితంగా ప్రభావితం చేయగలదు. అయినా కూడా గాజు గ్లాసు విషయంలో బిజెపి అంటి ముట్టనట్లుగా వ్యవహరించింది. ఈ వ్యవహారాలన్నింటిని చూస్తూ ఉంటే అసలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో పాటు కూటమిలో నరేంద్ర మోడీ, బిజెపి పార్టీ కూడా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోడీ ఇదే తీరున వ్యవహరిస్తే ప్రజలు కూటమిని నమ్మే పరిస్థితి ఉండదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జనసేన అని ఈ విషయంలో ఏమైనా బిజెపి ముఖ్య నాయకులతో మాట్లాడతారేమో చూడాలి. ఒక వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో కూటమి లో బలహీనతలు బయట పడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ముందు ముందు ఈ కూటమి ఎలా ఉంటుందో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News