Revanth Reddy : రేవంత్ సమర్థతకు ఇదే నిదర్శనం.. ఎంపీ టికెట్ల కోసం విపరీతమైన పోటీ..!

Qubetvnews - February 17, 2024 / 11:31 AM IST

Revanth Reddy : రేవంత్ సమర్థతకు ఇదే నిదర్శనం.. ఎంపీ టికెట్ల కోసం విపరీతమైన పోటీ..!

Revanth Reddy :

రేవంత్ రెడ్డి సమర్థత ఏంటనేది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే బయట పడింది. అడ్రస్ లేకుండా పోతున్న పార్టీని భుజాన వేసుకున్న రేవంత్.. అతికష్టం మీద పార్టీని పైకి తీసుకువచ్చారు. ఎంత మంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నా సరే పట్టించుకోకుండా ప్రతినిత్యం పార్టీ కోసం కష్టపడ్డారు. అందుకే ఆయన పని తీరుకు తెలంగాణ ప్రజలు కూడా నీరాజనాలు పలికారు. సీనియర్లు పట్టించుకోకున్నా సరే రేవంత్ సమర్థతను కింది స్థాయి కార్యకర్తలు బలంగా నమ్మారు. అందుకే రేవంత్ హయాంలో అందరూ కలిసికట్టుగా పని చేసి పార్టీని గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారు.

రేవంత్ రెడ్డి సమర్థత మీద నమ్మకం ఉంచిన కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం కూడా ఆయనకే మద్దతు పలికింది. ఎవరు ఎన్ని ఫిర్యాదుల చేసినా సరే రేవంత్ కే సీఎం పీఠం ఇచ్చింది. ఇక రేవంత్ సమర్థత మీద నమ్మకం ఉంచిన కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి హయాంలోనే ఎంపీ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయింది. అందుకే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల కమిటీ చైర్మన్ గా రేవంత్ ను నియమించింది. రేవంత్ రెడ్డి పనితనాన్ని మొన్నటి వరకు నమ్మని వారు కూడా ఇప్పుడు నమ్ముతున్నారు. ఆయన సమర్థతను మెచ్చుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో రేవంత్ కు చైర్మన్ పదవి ఇవ్వడాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు.

అంతే కాకుండా ఆయన మీద నమ్మకం ఉంచి అందరూ ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా రేవంత్ హయాంలో టికెట్లు సాధించుకోవాలని ఆరాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆశావహుల నుంచి టికెట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ఉన్న 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మొత్తం 306 దరఖాస్తులు వచ్చాయి. శనివారం చివరి రోజు ఏకంగా 166 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను దాఖలు చేశారు. గతంలో ఎన్నడూ కూడా కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఇంత మొత్తంలో దరఖాస్తులు రాలేదు. ఇదే మొదటిసారి అని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.

అంటే రేవంత్ పనితనం, సమర్థత మీద ఎంత నమ్మకం ఉంచారనేది చెప్పుకోవచ్చు. సెకండ్ గ్రేడ్ లీడర్ల నుంచి మొదలు పెడితే.. మంత్రుల ఇంట్లో వాళ్లు, వారసులు కూడా భారీగా పోటీ పడుతున్నారు. అంతకు ముందు పెద్ద కుటుంబాలకు చెందిన వారు తమ ఇంట్లో వారిని ఇలా నిలబెట్టలేదు.

కానీ ఈ సారి మాత్రం తమ ఇంట్లో వారిని దింపుతున్నారంటే రేవంత్ హయాంలో కచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతోనే వారు ఇలా దరఖాస్తులు చేసుకుంటున్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి తలచుకుంటే తమను కచ్చితంగా గెలిపిస్తాడని ఆశిస్తున్నారు. మరి రేవంత్ ఎలా వారిని గట్టెక్కిస్తారనేది వేచి చూడాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News