KCR : నల్గొండ సభ వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీజేపీని టార్గెట్ చేసేశారుగా..!
Qubetvnews - February 17, 2024 / 07:17 AM IST
KCR :
కేసీఆర్ ను తక్కువ అంచనా వేయడానికి అస్సలు లేదు. ఎలాంటి రాజకీయ పరిస్థితులను అయినా సరే తనకు అనుకూలంగా మార్చేసుకోగల వ్యక్తి. అందరి ఫోకస్ నిత్యం తన మీద ఉండేలా చూసుకోవడంలో ఆయన దిట్ట. అందుకే కేసీఆర్ రాజకీయ చతురత ముందు ఎవరైనా దిగదుడుపే అని చెప్పుకుంటారు బీఆర్ ఎస్ నేతలు. ఇప్పుడు మరోసారి ఇలాంటి ప్రయత్నమే చేశారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి కేసీఆర్ నల్గొండ సభలో మాట్లాడారు. ఎన్నికల తర్వాత మొదటిసారి ఆయన మైక్ పట్టుకున్నారు. దాంతో ఆయన ఏం మాట్లాడుతారా అని అందరూ వెయిట్ చేశారు.
అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా కేసీఆర్ స్పీచ్ తో అదరగొట్టేశారు. కేఆర్ ఎంబీకి కృష్ణా నది ప్రాజెక్టులు ఇవ్వొద్దని తేల్చి చెబుతూనే కాంగ్రెస్ ను కార్నర్ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఓ రేంజ్ లో దుయ్యబట్టారు. ఇక త్వరలోనే ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దానిపై కూడా ఆయన టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి సానుకూల వాతావరణం ఎక్కువగా ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. తెలంగాణలో కూడా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందనే టాక్ నడుస్తోంది. కాబట్టి బీజేపీని టార్గెట్ చేసుకునేందుకు కేసీఆర్ ఓ ఎత్తుగడ వేసేశారు.
నల్గొండ సభ వేదికగా కేంద్రానికి ఓ సవాల్ విసిరారు. తెలంగాణ నీటి వాటా మీద బీజేపీ అన్యాయం చేస్తోందని.. ఆ విషయంలో తాము కేంద్రంపై పోరాడుతామని తెలిపారు కేసీఆర్. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల ముంగిట కేసీఆర్ ఇలాంటి సవాల్ విసరడంతో బీజేపీ తమ ప్రధాన శత్రువు అని కేసీఆర్ చెప్పకనే చెప్పేశారు. అంటే ఈ ఎంపీ ఎన్నికల్లో బీజేపీని ఈ విషయంలో టార్గెట్ చేయబోతున్నారన్నమాట. కాంగ్రెస్ ను ఎత్తి చూపించడానికి చాలానే విషయాలు ఉన్నాయి. కానీ బీజేపీని టార్గెట్ చేయడానికి ఇదే ప్రధాన అస్త్రం అని కేసీఆర్ డిసైడ్ అయిపోయారు.
తెలంగాణకు నీటి పంపకాల విషయంలో కేంద్రం జాప్యం చేస్తోందని.. అందుకే తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరుగుతోందని కేసీఆర్ ఈ ఎన్నికల్లో బలంగా ప్రచారం చేసేందుకు నల్గొండ సభలో హింట్ ఇచ్చేశారు. అదే అంశాన్ని ఆయన ఇప్పుడు ప్రారంభించారు. ఎన్నికల్లో దాన్ని కంటిన్యూ చేయబోతున్నారన్నమాట.
కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల కోసం భారీగానే కసరత్తులు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఒక్కో పార్టీ మీద ఒక్కో అస్త్రాన్ని రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ విషయంలో ఇదే పెద్ద ఆయుధం అని తెలుస్తోంది. మరి కేసీఆర్ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో అనేది వేచి చూడాలి.




