KCR : వారి విషయంలో జాగ్రత్త పడుతున్న బీఆర్ఎస్.. రంగంలోకి కేసీఆర్..!
Qubetvnews - February 17, 2024 / 08:22 AM IST
KCR :
రాజకీయాల్లో ఫిరాయింపులు చాలా వరకు ఉంటాయి. అయితే అవి అవసరాన్ని బట్టి బయటపడుతుంటాయి. రాజకీయ నేతలకు కావాల్సింది అధికారమే. విపక్ష పార్టీల నుంచి చాలా వరకు అధికార పార్టీలోకి వెళ్తుంటారు. కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కొద్ది పాటి మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాంతో బీఆర్ఎస్ నేతలు కాస్త దూకుడుగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇలా రకరకాల కామెంట్లు చేశారు.
దాంతో ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు కౌంటర్ ఇవ్వాలని అనుకుందేమో. మంత్రలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు కూడా బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను లాగేస్తామని చెప్పడం సంచలనం రేపింది. ఆ వ్యాఖ్యలకు బలం చేకూరే విధంగా రేవంత్ రెడ్డిని కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి కలుస్తున్నారు. దాంతో వారు ఎక్కడ పార్టీ మారుతారో అనే భయం బీఆర్ఎస్ లో మొదలైంది. వారందరూ తమది ఆత్మీయ భేటీ అని చెబుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం వారిపై నజర్ పెంచారని తెలుస్తోంది.
మొన్నటి వరకు ఇంటి వద్దనే ఉన్న కేసీఆర్.. ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నారంట. ఎవరెవరైతే బీఆర్ఎస్ ను వీడుతారనే టాక్ ఉందో.. ఆ ఎమ్మెల్యేలను తన ఇంటికి పిలిపించు కోబోతున్నారు కేసీఆర్. వారికి అన్ని విధాలుగా రాజకీయ హామీలు ఇచ్చి కచ్చితంగా వారిని పార్టీలోనే ఉంచేలా నచ్చ జెప్పబోతున్నారంట. ఇందుకోసం త్వరలోనే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు సంకేతాలు వెళ్లబోతున్నాయి. కేసీఆర్ రాజకీయ చతురత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఏదైనా హామీ ఇస్తే కచ్చితంగా రాజకీయంగా నెరవేరస్తారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
కాబట్టి కచ్చితంగా కేసీఆర్ తమకు రాజకీయ పరమైన హామీ ఇస్తే అది నెరవేరుస్తారని నమ్మే అవకాశాలు ఉన్నాయి. దాని వల్ల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వలసలు ఆగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా కేసీఆర్ చేతుల్లోనే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భవిష్యత్ ఆధారపడి ఉంది.
కాంగ్రెస్ గూటికి వెళ్లకుండా అడ్డుకునే సత్తా కేసీఆర్ కు పక్కాగా ఉంది. కానీ రాజకీయంగా కాంగ్రెస్ కూడా ఇప్పటికే గేమ్ స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరి కేసీఆర్ చతురత గెలుస్తుందా లేదంటే కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా అనేది చూడాలి.



