Revanth Reddy : ఎన్నికల టైమ్ లో రేవంత్ బిగ్ స్కెచ్.. ఆ వర్గాల ఓట్లను టార్గెట్ చేశారా..!
Qubetvnews - February 22, 2024 / 02:08 PM IST
Revanth Reddy :
ఓ వైపు తెలంగాణలో ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇంకో వైపు పార్టీలు అప్పుడే ఎన్నికలకు రెడీ అయిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గెలిచి తమ పట్టు నిలుపుకోవాలని మూడు పార్టీలు భావిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొంది. కానీ ఈ ఎంపీ ఎన్నికల్లో మాత్రం మూడు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుంటే ఎంపీ ఎన్నికలు అంటే జాతీయ పార్టీలకు క్రేజ్ ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ కూడా బలంగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు.
ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగానే ఉన్నాయి కాబట్టి ఆ రెండు పార్టీల మధ్య పోటీ తత్వం గట్టిగానే ఉండనుంది. అందుకే ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డికి మరింత సవాల్ గా మారిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో 12 లేదా 14 ఎంపీ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. మరి ఎంపీ ఎన్నికల్లో భారీ సీట్లు రావాలంటే కచ్చితంగా ప్రజాదరణ పొందాలి. ఇప్పటికే తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కేవలం ఒక్కటి మాత్రమే నెరవేర్చారు. మరి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు కాబట్టి.. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో మధ్య తరగతి ఓట్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
వారం రోజుల్లోగా 200 యూనిట్ల కరెంట్ ను ఫ్రీగా ఇస్తామని రేవంత్ ప్రకటించారు. దాంతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.500కే గ్యాస్ సిలిండర్ ను ఇస్తామని ప్రకటించారు. ఈ రెండు గ్యారెంటీలు కూడా మధ్య తరగతి కుటుంబాలను ప్రభావితం చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రెండు గ్యారెంటీలు ఎక్కువగా మధ్య తరగతి వారికే వర్తిస్తాయి. అందుకే ఈ సారి ఎంపీ ఎన్నికల్లో ఈ రెండు గ్యారెంటీలు కీలకంగా మారబోతున్నాయి. మిగతా గ్యారెంటీలతో పోలిస్తే ఈ రెండు గ్యారెంటీలకు తక్కువగా నిధులు సరిపోతాయి.
కాబట్టి ఈ రెండు గ్యారెంటీలు ఎంపీ ఎన్నికల్లో ఎక్కువగా సీట్లు వచ్చేలా చేస్తాయన్నది కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు గ్యారెంటీలను చూపించి ఓట్లు అడగాలన్నది కాంగ్రెస్ ప్లాన్. అందుకే ఎంపీ ఎన్నికల కోసం ఈ రెండు గ్యారెంటీలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
మన తెలంగాణ ప్రజానీకంలో మధ్య తరగతి కుటుంబాలే అధికంగా ఉంటాయి. కాబట్టి వారి ఓట్లను టార్గెట్ చేస్తే కచ్చితంగా ఎక్కువ సీట్లు వచ్చేందుకు అవకాశాలు ఉండబోతున్నాయి. మరి ఈ రెండు గ్యారెంటీలు కాంగ్రెస్ కు ఎలాంటి ఫలితాలను తీసుకువస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిందే.



