BRS Party : రేవంత్ వ్యాఖ్యలే బీఆర్ఎస్ కు అస్త్రాలు.. వాటితోనే ప్రచారం..!

Qubetvnews - February 22, 2024 / 02:28 PM IST

BRS Party : రేవంత్ వ్యాఖ్యలే బీఆర్ఎస్ కు అస్త్రాలు.. వాటితోనే ప్రచారం..!

BRS Party  :

ఏ మాత్రం సందు దొరికినా సరే దాన్నే అస్త్రాలుగా మార్చుకోవడంలో బీఆర్ఎస్ నేతలు చాలా దిట్ట. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఎందుకంటే వ్యూహాలు పన్నడంలో బీఆర్ ఎస్ నేతలు చాలా షార్ఫ్‌. అధికారంలో ఉన్నప్పుడే తమ మీదకు ఎలాంటి విమర్శలు రాకుండా చాలా జాగ్రత్త పడేవారు. వారు అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతాయా.. అందులో మనకు ఎలాంటి అస్త్రాలు దొరుకుతాయా అని వేచి చూసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి అధికార పక్షంలో ఉన్న పార్టీని ఎన్ని విధాలుగా టార్గెట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బీఆర్ఎస్ ను రేవంత్ రెడ్డి ఎన్ని రకాలుగా టార్గెట్ చేశారో తెలిసిందే. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటుందనే అనుమానాలు లేవు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు.. అధికార పార్టీ నేతలు ఎలాంటి కామెంట్లు చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల విషయలంలో ప్రతి రోజూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇంకెప్పుడు అమలు చేస్తారంటూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతుంటడంతో ఈ విషయంలో మరింత ఒత్తిడి తెస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ సీట్లు గెలవాలని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. ఇందుకోసం గట్టిగానే ప్లాన్ చేసుకుంటుంది. అయితే రేవంత్ రెడ్డి ఆ మధ్య మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలకు నిధులు మనకు వస్తాయని చెప్పారు. ఇంకేముంది బీఆర్ ఎస్ ఊరుకుంటుందా.. కాంగ్రెస్ ను ఏకి పారేసింది. ఈ విషయం ముందే చెప్పాలి అంతే గానీ.. గెలిచిన తర్వాత హామీలను దాటవేస్తే ఊరుకోబోం అంటూ అల్టిమేటం జారీ చేసింది. అప్పటి నుంచి రేవంత్ మాటలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ టార్గెట్ చేసే పనిలోనే ఉంది.

ఇక రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో విషయంలో కూడా కాస్త టంగ్ స్లిప్ అయ్యారు. ఆయన తాజాగా మాట్లాడుతూ తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు కనీసం 14 స్థానాల్లో గెలిపిస్తేనే ఆరు గ్యారెంటీలను అమలు చేసుకోగలుగుతాం అని చెప్పారు. ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ బలంగా ప్రచారం చేసుకుంటోంది.

రేవంత్ రెడ్డి నమ్మించి మోసం చేశారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా దాటవేసేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ చేస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. రేపు ఎన్నికల్లో ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి రేవంత్ వ్యాఖ్యలే బీఆర్ ఎస్ కు ప్రచార అస్త్రాలుగా మారిపోయాయి.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News