BRS : ఆ విషయంలో కాంగ్రెస్ సక్సెస్.. కవర్ చేసే పనిలో బీఆర్ఎస్..!
Qubetvnews - February 19, 2024 / 12:25 PM IST
BRS :
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ ఎస్ అన్ని విషయాల్లో టార్గెట్ చేస్తోంది. అసలు పదేండ్లలో బీఆర్ ఎస్ పార్టీ అతిగొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టును ఎత్తి చూపించేందుకు కాంగ్రెస్ మొన్నటి వరకు ప్లాన్ చేసుకుంది. ఎలాగైనా బీఆర్ ఎస్ ఇమేజ్ ను దెబ్బ తీయాలని అనుకుంది. అనుకున్నట్టు గానే కాళేశ్వరం మీద మాస్టర్ ప్లాన్ వేసింది. సరిగ్గా ఎన్నికల సమయంలో మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తప్పును ప్రజలకు వివరించేందుకు ప్లాన్ వేసింది.
అసెంబ్లీ సాక్షిగా దానిపై ఎక్కువగా చర్చ జరిపింది. అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను తీసుకెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రజెంటేషన్ ఇవ్వడంతో మీడియాలో భారీగా రెస్పాన్స్ వచ్చింది. దాంతో కాళేశ్వరంను నిర్మించడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందనే వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. రేవంత్ రెడ్డి అక్కడిగో ఆగకుండా అదే ప్రజెంటేషన్ ను అసెంబ్లీలో కూడా చూపించారు. దాంతో అది ఇంకా వైరల్ అయిపోయింది. దెబ్బకు బీఆర్ఎస్ మీద ప్రజల్లో ఉన్న సానుకూల భావన మొత్తం పోయిందనే అంటున్నారు. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ కు ఇది పెద్ద దెబ్బ అయింది.

BRS Plans To Avoid Losing Image Of Kaleswaram Project
ఆ ఎఫెక్ట్ ఇంకా కనిపిస్తూనే ఉంది. అన్ని వర్గాల్లో దానిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇమేజ్ మొత్తం పోయేలా ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక మేడిగడ్డ బ్యారేజీలో లీకేజీలపై తాజాగా వీడియోలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తోంది. దాంతో అది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ప్రకంపన రేపుతోంది. ఇలా అన్ని విధాలుగా బీఆర్ఎస్ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఎత్తుగడ వర్కౌట్ అయిందని అంటున్నారు రాజకీయ నిపుణులు. రాబోయే రోజుల్లో ఇది బాగానే వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అటు బీఆర్ఎస్ కూడా దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నాల్లో పడింది. కాంగ్రెస్ ప్రభత్వం తమ మీద బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తోందని.. ప్రాజెక్టులో ఒక మూడు పిల్లర్లు కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం ఫెయిల్ అని ఎలా అంటారని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. కుంగిపోయిన పిల్లర్లకు రిపేర్ చేయించకుండా ఈ వాదన ఏంటని అడుగుతున్నారు.

BRS Plans To Avoid Losing Image Of Kaleswaram Project
ఇంజినీర్లు చెబుతున్న దాని ప్రకారం.. దాన్ని రిపేర్ చేయించడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయని.. కాబట్టి వాటిపై దృష్టి పెట్టుకుండా ఇలా తమ మీద లేనిపోని బురద జల్లడం ఎందుకు అని అడుగుతున్నారు. కానీ బీఆర్ ఎస్ ఎంత కౌంటర్ అటాక్ చేస్తున్నా సరే కాంగ్రెస్ వేసిన ఎత్తుగడ ముందు తేలిపోయినట్టే అని అంటున్నారు.



