KCR : అదును చూసి దెబ్బ కొట్టబోతున్న కేసీఆర్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉందే..!

Qubetvnews - February 17, 2024 / 10:51 AM IST

KCR : అదును చూసి దెబ్బ కొట్టబోతున్న కేసీఆర్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉందే..!

KCR :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కేసీఆర్ బయటకు రాలేదు. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటూ రెస్ట్ తీసుకున్నారు. తుంటి ఆపరేషన్ తర్వాత ఆయన ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అయితే బయటకు వస్తూనే భారీ ప్లాన్ వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు రెడీ అవుతున్నారని సమాచారం అందుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రీసెంట్ గా తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు బీర్ఎస్ కు ఆయుధం అయిపోయందని అంటున్నారు. అదే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం.

అసలు తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం మీద. తెలంగాణ నీళ్ల దోపిడీకి గురవుతుందనేది ఆనాడు కేసీఆర్ ప్రధానంగా ఎత్తుకున్న ఎజెండా. అప్పట్లో రైతులకు నీళ్లు అందకుండా ఆంధ్రాకు తీసుకెళ్తున్నారంటూ అప్పట్లో కేసీఆర్ చాలా ఉద్యమాలు చేశారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టులను తన కంట్రోల్ లోకి తీసుకున్న కేసీఆర్.. కొత్త ప్రాజెక్టులను ఎన్నో కట్టి చూపించారు. అలాంటి ప్రాజెక్టులను ఇప్పుడు కేఆర్ ఎంబీకి అప్పగించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందనే వివాదం ఇప్పుడు రాజకుంటోంది.

కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున నిరసనలు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిన్న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. కృష్ణా పరివాహక ప్రాంత జిల్లాల్లోని బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చాలానే చర్చలు జరిపారు. ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. ఈ సభ ద్వారా తన వాయిస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఈ అంశం మీద కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు.

గత రెండు నెలలుగా మౌనంగా ఉన్న కేసీఆర్.. ఇప్పుడు అదును చూసుకుని మంచి పాయింట్ మీద పోరాటానికి రెడీ అవుతున్నారు. కేసీఆర్ ఏదైనా అంశం మీద పోరాటం చేయాలనుకుంటే ఏ స్థాయిలో కొట్లాడుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి తెలంగాణ ఉద్యమమే ముఖ్యం ఉదాహరన.

అలాంటిది ఇప్పుడు తెలంగాణ నీటి ప్రాజెక్టుల విషయంలో ఇంకెలా పోరాడుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సభ ద్వారా తెలంగాణ హక్కుల కోసం పోరాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చాటి చెప్పేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. మరి ఈ సభ ఎంత సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News