Congress Party : బీఆర్ఎస్ అసంతృప్తులకు రేవంత్ గాలం.. వర్కౌట్ అవుతుందే..!
Qubetvnews - February 17, 2024 / 10:59 AM IST
Congress Party :
బీఆర్ ఎస్ పాఠాలను తిరిగి అప్పజెప్పాలని రేవంత్ రెడ్డి రెడీ అయినట్టున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ మీద బీఆర్ ఎస్ నేతలు చేస్తున్న కామెంట్లు ఎంత సంచలనం రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని.. రేవంత్ రెడ్డి కుర్చీ దిగిపోతారని.. ఇలా రకరకాల కామెంట్లు చేయడం మనం చూశాం. అయితే ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ మంత్రులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్టు అర్థం అవుతోంది. మమ్మల్ని కూల్చడం పక్కన పెడితే.. ముందు మీ పార్టీని ఖాళీ చేసి తీరుతాం అన్నట్టు రేవంత్ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు.
గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారు. అది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అలాంటి బీఆర్ ఎస్ పనులను తిరిగి ఆ పార్టీకే రుచి చూపించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేశారు. బీఆర్ ఎస్ లో ముందుగా అసంతృప్తిగా ఉన్న నేతలను గాలం వేస్తున్నారు. ఇందులో భాగంగానే మొన్న మాజీ డిప్యూటీ సీఎం అయిన రాజయ్య బీఆర్ ఎస్ కు రాజీనామా చేశారని తెలుస్తోంది. ఆయన త్వరలోనే కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.
కాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గంలో మరో నేత చేరిపోయారు. ఆయన ఎవరో కాదు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాని ఆయన గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పెద్దపల్లి నుంచి గెలిచారు. అయితే ఆయన గెలిచిన తర్వాత ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువ కావడంతో పాటు అధిష్టానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని ఆయన బాధపడుతున్నారు. అందుకే ఇప్పుడు ఎంపీగా ఉండి కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసేశారు. అంతే కాకుండా వెంటనే కాంగ్రెస్ గూటికి వెళ్లిపోయారు. ఇలా అసంతృప్తులుగా ఉన్న వారిని టార్గెట్ చేస్తున్నారు రేవంత్.
మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం ఆశపడి భంగపడ్డ వారితో పాటు ఎంపీ ఎన్నికల్లో సీటు రాదనే అసంతృప్తితో ఉన్న వారిని ముందుగా కాంగ్రెస్ లోకి లాగేసుకోవాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. అందులో బలమైన నేతలకు కొన్ని పదవులు ఆశ చూపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంట.

Pedpadalli MP Venkatesh Neta Joined Congress Party
దాంతో పాటు ఎమ్మెల్సీ పదవులు, కొన్ని నామినేటెడ్ పదవులను కూడా ఇస్తామని చెబుతున్నారు. త్వరలోనే ఇందుకోసం పూర్తి ఏర్పాట్లను చేయబోతున్నారంట. కాగా కాంగ్రెస్ లో చేరుతున్న వారంతా కూడా రేవంత్ వర్గంగా పని చేయాలని అనుకుంటున్నారని సమాచారం. రేవంత్ ను నమ్మి వారంతా ఇలా రంగంలోకి దిగుతున్నారు. ఇది బీఆర్ ఎస్ కు పెద్ద దెబ్బే అని చెప్పుకోవాలి.



