Revanth Reddy : కేసీఆర్ వద్దన్న పని చేస్తున్న రేవంత్.. ఆ వర్గాన్ని ఆకట్టుకోవడమే లక్ష్యం..!
Qubetvnews - February 23, 2024 / 09:47 AM IST
Revanth Reddy :
ఏ పార్టీ అయినా సరే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తుంది. అంతే గానీ.. ఈ ఒక్కసారే సరిపోతుంది అని మాత్రం ఎవరూ చెప్పరు. ఇప్పుడు తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కీలక బాధ్యతలు ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బలంగా నమ్ముతోంది. అందుకే ఎంపీ ఎన్నికల తెలంగాణ కమిటీ చైర్మన్ కూడా రేవంత్ రెడ్డినే నియమించింది. దాంతో ఇప్పుడు రేవంత్ ఎలాగైనా ఎన్నికల్లో బలమైన సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే తమకు ఏయే జిల్లాల్లో పట్టు లేదో వాటిపై దృష్టి పెడుతున్నారు రేవంత్. తమకు దూరమైన వర్గాలను కలుపుకుని పోయేందుకు రెడీ అవుతున్నారు. అయితే కాంగ్రెస్ కు హైదరాబాద్ నగరం మీద పెద్దగా పట్టు లేదు. కనీసం జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కూడా మెజార్టీ కార్పొరేట్ సీట్లను గెలవలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కంటే తక్కువ సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే మరీ దారుణం. హెచ్ఎంసీ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకు చేరువ కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ.
ఇందులో భాగంగా కేసీఆర్ వద్దన్న ప్రాజెక్టును ముందుకు వేసుకున్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య అనేది చాలా పెద్దది. దాన్ని పరిష్కరించడం కోసం గత కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఏర్పాటు చేయాలని భావించింది. కానీ ఎందుకో దాన్ని ముందుకు వేసుకోలేకపోయింది. అయితే ఇప్పుడు రేవంత్ మాత్రం ఆ రిస్క్ తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఐదు సొరంగ మార్గాలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. కాజాగుడ, నానక్‌రాంగూడ మీదుగా విప్రో జంక్షన్ వరకు ఒకటి, మైండ్ స్పేస్ మీదుగా జేఎన్‌టీయూ జంక్షన్ వరకు రెండోది,
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 మీదుగా రోడ్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 వరకు మూడోది, జీవీకే1 మాల్ నుంచి మసాబ్ ట్యాంక్ మీదుగా నానల్ నగర్ వరకు మరో టన్నెల్ తవ్వాలనే ప్రతిపాదన ఉంది. దీంతో పాటు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 మధ్య ఓ టన్నెల్ ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.

Revanth Reddy Planning Reduce Traffic Problem In Hyderabad
ఈ టన్నెల్స్ ద్వారా భారీగా ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుందనేది రేవంత్ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. వీటి ద్వారా ట్రాఫిక్ సమస్యలను తగ్గించి హైదరాబాద్ ప్రజలకు చేరువ కావాలనేది తమ ఆలోచన అన్నట్టు రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు పెద్ద ఎత్తున చర్చకు వస్తే మాత్రం కచ్చితంగా హైదరాబాద్ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ మీద సానుకూలత పెరుగుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆ ఫలితం ఎంపీ ఎన్నికల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.



